హైదరాబాద్‌ వేదికగా జులై 8న ఏకంగా 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు.

అయితే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో… ఈసమావేశం సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఈ కీలక సమావేశానికి హైదరాబాద్‌ను వేదిక చేసుకున్నట్లు తెలుస్తున్నది.