ఆర్టీసీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2వేలకు పైగా డ్రైవర్, 1000కిపైగా కండక్టర్ పోస్టులతో పాటు 200కు పైగా సూపర్ వైజర్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలోపు ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.