మొగుళ్లపల్లి

రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్,ఎస్,యు, ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ పదవులను చేపట్టారు. ఎన్ ఎస్,యు, ఐ లో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ మెంబర్ గా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆసమయంలోనే మొగుళ్ళపల్లి సింగిల్ విండో చైర్మన్ గా పదవి బాధ్యతలను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి క్రాఫ్ లోన్స్, సబ్సిడీ ఎరువులను అందజేసి రైతాంగానికి తోడ్పడ్డారు. 9 సంవత్సరాల కాలంలో ఆయన రైతుల మన్ననలు పొందడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గెలుపు కోసం మండలంలోని ముఖ్యులను కలిసి విజయ బావుటాను ఎగురవేశారు.