సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబు సొత్తా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ‘ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు.

ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా? నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లు ఉంటే.. అందులో రూ. 2.5 లక్షల కోట్లు బాబు చేసినవే. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే. అదేమైనా అద్భుత కట్టడమా’ అని ఆయన మండిపడ్డారు.