మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు నిబంధనలను సవరించింది. గతంలో 80 ఏళ్లు, ఆపై వయసు వారికి ఇంటి నుంచే ఓటేసే సదుపాయం ఉండగా తాజాగా ఈసీ వయసు పరిమితిని పెంచింది.