హార్వర్డ్ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 67 లక్షల మంది చిన్నారులు ఆహారలేమితో బాధపడుతున్నారని పేర్కొంది.
92 దేశాల్లో ఆహారం అందని చిన్నారుల సంఖ్యలో ఇది సగమని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (9.62లక్షలు), పాకిస్థాన్ (8.49లక్షలు) ఉన్నాయి. తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాలు సరైన సామాజిక, ఆర్థిక కారణాలతో చిన్నారులకు పౌష్ఠికాహారాన్ని అందించలేకపోతున్నాయని తెలిపింది.