లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గురించి తెలియని వారుండరు. ఆవిడ మనవరాలు జనై భోస్లే సినీ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు.

సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జనై ఛత్రపతి శివాజీ భార్య రాణి సై భోంసలే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఆశా భోస్లే ఆనందం వ్యక్తం చేశారు. జనై తన గమ్యాన్ని చేరుకుంటుందని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.