తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు. ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధిష్ఠానం 2019లో గవర్నర్ పదవిని కట్టబెట్టింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారైనా కలిసొస్తుందేమో చూడాలి.