చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు వేటపై విధించనున్న నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నిషేధ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే బోట్లతో సహా వాటిలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటామని పేర్కొంది. ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం 1994 సెక్షన్ (4) కింద శిక్ష పడుతుందని, డీజిల్ రాయితీతో పాటు అన్ని రకాల సౌకర్యాలను నిలిపివేస్తామని తెలిపింది.