కాస్త పేరున్న హీరోలతో నటిస్తున్న హీరోయిన్స్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే పెద్దగా లెక్క చెయ్యరు. కానీ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వస్తే మాత్రం వదులుకోరు. అలా చాలామంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ ఛాన్స్ ఒప్పుకుని తర్వాత మోసపోయామనుకుని తెగ ఫీలైపోతారు. ఇప్పుడు ఆ కోవలోకి ఈషా రెబ్బ చేరింది.

ఈషా రెబ్బ సక్సెస్ ఫుల్ గా యంగ్ హీరోలతో సినిమాలు చెయ్యకపోయినా, సినిమాలు, వెబ్ సిరీస్ లతో నిత్యం బిజీగానే ఉంటుంది. అలాంటి ఆమెకి త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో త్రివిక్రమ్ పిలిచి ఛాన్స్ ఇస్తే.. సెకండ్ హీరోయిన్ గా చెయ్యడం ఇష్టం లేదు అని చెప్పిన ఆమె తర్వాత ఒప్పుకోవడం, ఆ తర్వాత ఆమె పాత్ర చూసి చివరికి అవాక్కవడం జరిగిన విషయాలని ఇప్పడు బయటపెట్టింది ఈషా రెబ్బ.

త్రివిక్రమ్ అరవింద సమెత కథ చెప్పారు, నువ్వు సెకండ్ లీడ్ అన్నారు. ముందు కాదనుకున్నాను. కానీ స్టార్ హీరో సినిమా కాబట్టి షూటింగ్ కి ఒక్క రోజు ముందు ఓకె చెప్పాను. షూటింగ్ అంతా సరదాగా జరిగిపోయింది. సినిమా విడుదలకు ముందు నన్ను సెకండ్ లీడ్ గా అనౌన్స్ చేస్తా అన్నారు. అది జరగలేదు. ఒకవేళ అలా చేసుంటే నా కేరీర్ కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యేది.

ఆ విషయం మా మేనేజర్ ని కనుక్కోమన్నాను, షూటింగ్ అయ్యిపోయింది, సినిమా రిలీజ్ అయ్యింది. ఆ చిత్రంలో నాకేరెక్టర్ కి సంబంధించి కొన్ని సీన్స్ కూడా కట్ చేసారు. ఎన్టీఆర్ సాంగ్ అన్నారు అది కూడా లేదు. అరవింద సమెత చిత్రంలో ఛాన్స్ పట్ల నాకు ఎలాంటి సంతోషం లేదు. కానీ త్రివిక్రమ్-ఎన్టీఆర్ తో వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది అంటూ ఆ చిత్రంపై తన అసంతృప్తిని ఈషా రెబ్బ ఇప్పుడు బయటపెట్టింది.