గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురికావడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా రిపేర్లు చేయలేదని ధ్వజమెత్తారు. తాను క్షేత్రస్థాయిలోకి వెళ్తే.. సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందనే వెళ్లలేదని తెలిపారు.