మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని చిన్నతరహా, పెద్దతరహా వ్యాపారస్థులు ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ తెలిపారు.

ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని వివిధ వ్యాపార సంబంధిత షాపులకు ట్రేడ్ లైసెన్స్‌ రెన్యువల్‌ను వెంటనే చెపించుకోవాలని కోరారు. ఇంతవరకు ట్రేడ్ లైసెన్స్ పొందని వారు లేదా లైసెన్స్ ఫీజు బకాయిలు చెల్లించనివారు ఫీజును వెంటనే మున్సిపాలిటీకి చెల్లించాలని తెలిపారు.

రెన్యువల్ కు సంబంధించిన ఫీజు చెల్లించని వ్యాపారులపై గరిష్ఠంగా 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు జ‌రిమానా విధించబడుతుందని తెలిపారు. అవసరమైతే సంబంధిత షాప్‌పై 25 రెట్లు పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు  వ్యాపారస్తులపై తెలంగాణ మునిసిపల్ చట్టం – 2019 ప్రకారం తగిన శాసనపరమైన చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తెలిపారు.