మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 20 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
తెలంగాణ రాష్ట్రంలోని హోమ్ గార్డ్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీఐ(యు) కార్యక్రమంలో ఎంసిపిఐ (యు) జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ…
తెలంగాణా రాష్ట్రంలోని హోం గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ప్రతి నెల ఒకటి రెండు తేదీలలో అధికారులతో సమానంగా జీతాలు వేయాలని, గత కొన్నేళ్లుగా అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం సిపిఐయు పార్టీ పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, ఆరెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.