localnewsvibe

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీష్‌ సిసోడియా కేసులో సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ నోటీసులను అందుకున్న కల్వకుంట్ల కవిత సీబీఐకి ఆదివారం వాంగ్మూలం ఇవ్వనున్నారు.

ఈనెల 11న తాను అందుబాటులో ఉంటానంటూ కవిత ప్రకటించిన నేపథ్యంలో… సీబీఐ అధికారులు ఆమె ఇంటికి నేడు ఉదయం 11గంటలకు రానున్నారు.

ఇవాళ సీబీఐ రాకతో కవిత నివాసం వద్దకు నేతలు, కార్యకర్తలు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేసింది టీఆర్‌ఎస్‌. కవితకు నోటీసు రాజకీయ కుట్ర అని అంటున్న టీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపణలు చేసింది. అయితే.. సీబీఐ విచారణలో ఏం జరుగుతుందని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ చట్టపరంగా వ్యవహరిస్తే సహకరించాలని.. అలాలేని పక్షంలో న్యాయపోరాటం చేయాలని కవిత భావిస్తున్నారు. సీబీఐ నోటీసులపై ఇప్పటికే న్యాయ నిపుణులతో కల్వకుంట్ల కవిత చర్చించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే.. మెటీరియల్ ఎవిడెన్స్ లేదని ఆ ఇద్దరికీ ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది.