భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్

గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు పనులను పరిశీలించారు.

శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకతీయ కాలం నాటి ఆలయాన్ని పునర్నిర్మిస్తూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్న చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి లాంటి వారికి పురాతన కాకతీయ కాలంనాటి ఆలయని నిర్మించే అద్భుతం అవకాశం వచ్చిందని అన్నారు.

భద్రాద్రి జిల్లాలో స్వామివారి దివ్య ఆశీస్సులతో జిల్లా మరియు చుట్టుపక్కల గ్రామాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని తమ వంతు ప్రభుత్వం ద్వారా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తామని గతంలో స్వామివారి కల్యాణనికి వచ్చినట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి గారు, వంద రోజులు శీను గారు, అరేం ప్రశాంత్, అరేం మహేష్ గార్లు పాల్గొన్నారు.