ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సర్వే నిమిత్తం గ్రామానికి వెళ్లిన గూగుల్ మ్యాప్స్ బృందాన్ని స్థానికులు దొంగలుగా పొరబడ్డారు.

అనుమానంతో వారి వాహనాన్ని అడ్డగించి, అందులోని ఉద్యోగులను బయటకు లాగి చితకబాదారు. ఈ దాడిలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గ్రామస్థులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.