భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్
జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ …
అన్ని క్రీడలను ఒకే మైదానంలో చూడాలి… – డాక్టర్ యుగంధర్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచ డివిజన్ శ్రీనివాస్ కాలనీ మినీ స్టేడియంలో జాతీయ క్రీడలను ప్రారంభించిన ట్రైన్ కలెక్టర్ సౌరబ్ శర్మ. రాష్ట్ర యువజన మరియు క్రీడ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి మరియు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పిలుపుమేరకు ఈనెల 23 (నిన్నటి )నుండి 31 వరకు 9 రోజులు పాటుగా జాతీయ క్రీడ పోటీలను మండల స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ… అన్ని జిల్లా కేంద్రాలలో క్రీడలు నిర్వహించాలని ఆటల వల్ల విద్యార్థులకు మంచి ఆరోగ్యాన్ని కలుగుతుంది అన్నారు. మన జిల్లా నుండి స్పోర్ట్స్ కు మన జిల్లా కలెక్టర్ అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నారని, అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్స్ వారు ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అన్ని వేళలో మీకు సహకార అందిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం జాతీయ క్రీడ వేడుకలను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీనివాస్ కాలనీ మినీ స్టేడియం లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొన్ని క్రీడా ప్రాంగణాలను పెంచుకోవడం పట్ల జిల్లా కలెక్టర్‌కు మరియు జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో మరిన్ని క్రీడా మైదానాలు బ్యాట్మెంటన్ రైఫిల్ షూటింగ్ రన్నింగ్ ట్రాక్ వివిధ క్రీడలను ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. ఉదయాన్నే క్రీడా మైదానాలకు వచ్చే పిల్లలకు క్రమశిక్షణ, అంకిత భావం, చురుకైన ఆలోచన విధానాలు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ భాస్కర్, కోశాధికారి వంశీ, టెన్నిస్ కోచ్ డానియల్ రాంబాబు, ఆర్చరీ కోచ్ కళ్యాణ్, ఆర్ఐ సి ఐ కృష్ణారావు, మసూద్, టెన్నిస్ క్రీడాకారులు మరియు ఆర్చరీ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
