మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణములో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పలువురు వ్యాపారస్తులు 125 మైక్రాన్ల కంటే తక్కువ మందంతో ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించబడింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వాటి వినియోగం నిషేధితమైనందున , నిబంధనలను ఉల్లంఘించిన 4 దుకాణాలపై మొత్తం 15 వేల జరిమానా విధించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…, ఎవరైనా 125 మైక్రాన్ల కంటే తక్కువ మందంతో ఉన్న ప్లాస్టిక్ కవర్లను విక్రయించరాదని, ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు కలిగిస్తుండడం వల్ల, ప్రతి ఒక్కరూ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, బెల్లంపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో సహకరించాలని కోరారు.
ఈ తనిఖీలలో కమిషనర్ తన్నీరు రమేష్,పర్యావరణ ఇంజనీర్ బి.సంతోష్, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ జి.సునీల్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి….
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
