మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:5 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: స్థానిక బూడిదిగడ్డ బస్తీ 21 వ వార్డులో వాటర్ ట్యాంక్ ఏరియా దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మండలిలో బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

ఆనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, బూడిదగడ్డ బస్తి ప్రజలకు ఆ గణనాథుని ఆశీర్వాదాలు ఉండాలని,పౌర సేవలో పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

కుల మతాలకు అతీతంగా ప్రజలు మంచి వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, వినాయక నిమజ్జనం కూడా యువత శాంతియుత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజనాల కమల, బీఆర్ఎస్.వీ జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజనాల రమేష్,కమిటీ సభ్యులు బడికల లక్ష్మణ్, నాగుల రాంచందర్,సుంకరి తిరుపతి, దుర్గం సురేష్, మాదరబోయిన గోపాల్, సుంకరి వెంకటేష్,పెద్దపల్లి లక్షయ్య, మల్లెపల్లి మోహన్, కంటేవాడ నగేష్, పాఠకుల సురేష్, బస్తి ప్రజలు పాల్గొన్నారు.