మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

సింగరేణి డైరెక్టర్ గా ఆదీవాసీ ముద్దుబిడ్డ మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక అవ్వడం పట్ల శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…

ఇల్లందు మండలం కట్టుగూడెం కు చెందిన బిడ్డ ఉన్నత స్ధాయికి ఎదగడం హర్షీంచదగ్గ విషయం – ఎమ్మెల్యే కనకయ్య గారు అన్నారు.

139 సంవత్సరాల సింగరేణి సంస్ధలో మొదటి ఆదీవాసి బిడ్డగా ఉన్నత స్ధాయికి ఎదగడం, గర్వించదగ్గ విషయం. ఇల్లందు మండలం కట్టుగూడెం గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, ఉన్నత చదువులు అభ్యసించి, అంచలంచలుగా ఎదుగుతూ నేడు సింగరేణి కాలరీస్ కంపెనీ లో ఉన్నత స్ధాయి డైరెక్టర్ గా నియమితులైన మోకాళ్ళ తిరుమల రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఇల్లందు నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు.