🌿బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులను
అనుగ్రహిస్తున్నాడని ఐహీకం.

🌸ఈ నవ బ్రహ్మల రూపాలు
1.కుమార బ్రహ్మ
2.అర్క బ్రహ్మ
౩. వీర బ్రహ్మ

  1. బాల బ్రహ్మ
  2. స్వర్గ బ్రహ్మ
  3. గరుడ బ్రహ్మ
  4. విశ్వ బ్రహ్మ
  5. పద్మ బ్రహ్మ
  6. తారక బ్రహ్మ

🌿ఈ తొమ్మిది రూపాలతో
తొమ్మిది శివలింగాలను
విడి విడిగా ఆలయాలలో
ప్రతిష్టించి, బ్రహ్మ దేవుడు
పూజించిన ఆలయాలు
ఆంధ్రప్రదేశ్ లోని  మెహబూబ్ నగర్ జిల్లా , అలంపూర్  .ఇక్కడ యీ
ఆలయాలు ఖ్యాతిగాంచినవి.

🌷కుమార బ్రహ్మ:🌷

🌿  శ్రీ మహావిష్ణువు కి పుత్రుడైన బ్రహ్మదేవుడు సృష్టి కార్యాని విజయవంతంగా నిర్వహించడానికి ఇక్కడ
తపస్సు చేసిన మూర్తి
తెలుపుతుంది

🌷అర్క బ్రహ్మదేవుడు :🌷

🌸సూర్య మండలంలో నివసించే బ్రహ్మదేవుడు. పరమ శివుని   పంచభూత రూపములలో ఒకటి అయిన  సూర్య మండలంలో, యీ అర్క బ్రహ్మదేవుడు , ఉన్నతంగా పూజింపబడుతున్నాడు.

🌷వీర బ్రహ్మ రూపం:🌷

🌿మూర్ఖులైన అసురులతో
యుద్ధం చేసిన భంగిమని
తెలియచేస్తున్నది.

🌷బాల బ్రహ్మ రూపం:🌷

🌸 అత్రి…అనసూయ దంపతుల వద్ద బాలునిగా వున్న  రూపం.

🌷స్వర్గ బ్రహ్మ:🌷

🌿యాగాలు చేసి ఉన్నతి పొందిన వారి స్వర్గ రక్షకుని రూపం.

🌷గరుడ బ్రహ్మ:🌷

💐ఒకసారి పక్షి రూపంలో
వున్న మునులకు, గరుడ పక్షి రూపంలో  ఉపదేశం చేసినందున యీ పేరు  వచ్చింది.

🌷విశ్వ బ్రహ్మ రూపం:🌷

🌿ఈ  విశ్వాన్ని సృష్టించిన సమయంలో విశ్వబ్రహ్మ రూపం దాల్చాడు.

🌷పద్మ బ్రహ్మ రూపం:🌷

🌸శ్రీ మహావిష్ణువు  నాభినుండి ఉద్భవించి పద్మంలో ఆశీనుడైనందున యీ పేరు వచ్చింది.

🌷తారక బ్రహ్మ:🌷

🌿తారక మంత్రానికి అధిదేవత అయినందున
యీ పేరు తో పిలువబడుతున్నాడు.