అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం పోలీస్ కమిషనరేట్
తేది:22.08.2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత…
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం పోలీస్ కమిషనరేట్: మంచిర్యాల జోన్ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ ఎం.వెంకట్ రెడ్డి, ఎఎస్ఐ(70) అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య శ్రీలత కి భద్రత ఎక్స్గ్రేషియా 8 లక్షల రూపాయల చెక్ ను శుక్రవారం రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తన కార్యాలయం లో వారికి అందజేశారు.
ఈ సందర్భంగా మరణించి ఎఎస్ఐ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు.
పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి,ఏఓ శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
