భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పినపాక ఏజెన్సీ
✍️దుర్గా ప్రసాద్

పినపాక ఏజెన్సీ ఏరియాలోని అనుమతులు లేనీ టైలరింగ్, మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తూన్న అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి అని ఐటీడీఏ పీవో బి. రాహుల్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ఏరియాలోని అనుమతులు లేనీ టైలరింగ్, మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తూన్న అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలనీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ… సోమవారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారు లో పీవో బి. రాహుల్ కి వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ఏరియాలో అనుమతులు లేనటువంటి టైలరింగ్ ,మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయనీ వీటిని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో యజమానులు ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తూ ఒక పద్ధతి లేకుండా ఏ షాపు వారు ఆ షాపు అధిక ధరలు పెంచుకుంటూ సామాన్యుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు.

సామాన్య, మధ్యతరగతి ప్రజలు వస్త్రాలు కుట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీనిపై ఆధారపడి జీవిస్తున్న టైలర్లు కూడా వీటి ధాటికి ఉపాధి కోల్పోయారన్నారు. ఏజెన్సీ ప్రాంతం కనుక గిరిజన చట్టాల నేపథ్యంలో అనుమతులు లేనటువంటి టైలరింగ్ మగ్గం వర్క్ షాపులపై తగు చర్యలు తీసుకోగలరని బి. రాహుల్ కోరినట్లు బాబు తెలిపారు.

భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో పిఓ ప్రత్యేక కృషితో గిరిజన సాంప్రదాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక మొక్కను బహుకరించారు.