భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
CPI పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి గారు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది – పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు గారు
సిపిఐ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు బొల్లోజు అయోధ్య చారి గారు ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం. పినపాక నియోజకవర్గం మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అయోధ్య గారు చేసిన సేవలు మరువలేనివి.
వారి మృతి సిపిఐ పార్టీకి తీరని లోటు నాలుగు దశాబ్దాల పాటు ప్రజాహక్కుల కొరకు అలుపెరగని పోరాటాలు చేసిన అయోధ్యగారు ఇక లేరు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. అయోధ్య గారితో నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచి వేసింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా తట్టుకుని ముందుకు సాగాలని నా సానుభూతిని తెలియచేస్తున్నాను.
ఓం శాంతి
మీ
పాయం వెంకటేశ్వర్లు
MLA పినపాక.
ఇవి కూడా చదవండి….
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






