గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,
తేదీ:22/08/2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి, గణేష్ మండపాల నిర్వహకులకు జిల్లా ఎస్పీ సూచన.
జిల్లాలో లక్కీ డ్రా, లాటరీలు వంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు, అవసరమైతే పీడి యాక్ట్ నమోదు చేస్తాం ~ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమురం భీమ్ ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో రాబోయే గణేష్ నవరాత్రి వేడుకలు, దసరా వంటి పండుగలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు.
జిల్లాలో లక్కీ డ్రాలు, లాటరీలు, బహుమతి పథకాలు వంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఆదేశించారు.
ఎస్పీ మాట్లాడుతూ…, లాటరీ విధానం, లక్కీ డ్రా వంటి కార్యకలాపాలు పూర్తిగా చట్ట విరుద్ధమని, వీటి ద్వారా అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అక్రమ లాటరీలు లేదా లక్కీ డ్రాలను నిర్వహించే నిర్వాహకులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రంలో లాటరీలు, లక్కీ డ్రా విధానంపై నిషేధం ఉందని, నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే పీడి యాక్ట్ (PD Act) నమోదు చేయబడుతుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “జిల్లాలో ఎక్కడైనా లాటరీలు లేదా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712670551 కు తెలియజేయాలని అన్నారు.
జిల్లా ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు విభాగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజలు కూడా విధిగా పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్











