భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి.
అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐ.పి.ఎస్.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతుందని తెలియజేశారు.
అత్యవసరమైతే తప్పు బయటికి రావద్దని సూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకల వద్దకు వీడియోల కోసం, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.
వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






