గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకుని క్రమేపీ పెరుగుతూ… ఉదృతంగా ప్రవహిస్తున్నందున, గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు,వాగులు,వంకల వద్దకు వీడియోల కోసం,సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదివే గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పొంగుతున్న వాగులు, చెక్ డ్యాముల వద్దకు వెళ్లకుండా చూడాలని అన్నారు.

అత్యవసరమైన విపత్కరమైన పరిస్థితులలో సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలి.

భద్రాద్రి కొత్తగూడెం@పాల్వంచ 08744-241950,(వాట్సాప్) 93929 19743

ఐటీడీఏ భద్రాచలం కంట్రోల్ రూమ్ నెంబర్ 799 5268 352

సబ్ కలెక్టర్ ఆఫీస్, భద్రాచలం 08743-2324444, (వాట్సాప్) 93479 10737