భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

మేజర్ ధ్యాన్ చందన్ చిత్రంతో టెన్నిస్ క్రీడాకారుని భాను శ్రీ .

ప్రకాశం స్టేడియంలో శుక్రవారం ఏర్పాటుచేసిన జాతీయ క్రీడా దినోత్సవలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పిలుపుతో జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో జిల్లా యువజన మరియు క్రీడ విభాగాల అధికారి పరంధామ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ క్రీడ రంగాలకు మరియు ఒలంపిక్ అసోసియేషన్ వారికి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు.

వివిధ క్రీడ విభాగాల కోచ్ మరియు అసోసియేషన్ వారు ఈనెల 23 నుండి క్రీడ పోటీలను నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగినది.

ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ… మేజర్ మ్యాచ్ చందన్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా పోటీలను నిర్వహించుకుంటామని. తన ఆశయాల్లో భాగంగా కొత్తతరం క్రీడాకారులను తీర్చిదిద్దే విధంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అన్నారు.
అతి తక్కువ కాలంలో స్పోర్ట్స్ డే ని విజయవంతం చేసిన జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్, పి టి, అసోసియేషన్, కోచ్ మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం విజేతలకు మెడల్స్ అందించడం జరిగింది. ఇంకా రెండు రోజులు స్పోర్ట్స్ డే కార్యక్రమాలు ఉన్నాయని గుర్తు చేశరు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడా అధికారి పరంధామ రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ సెక్రెటరీ నరేష్, జిల్లా బాక్సింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్, టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు, బ్యాట్మెంటన్ సెక్రెటరీ సావిత్రి మరియు వివిధ క్రీడాల కోచ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.