భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్

పాల్వంచ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన పలు దశదిన కర్మల్లో రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, సంతాపం తెలిపారు.

పట్టణ పరిధిలోని టీచర్స్ కాలనీ కి చెందిన యనగంటి చంద్రశేఖర్ (బాచి) తల్లి కీ.శే. యనగంటి ఉమా మహేశ్వరరావు భార్య యనగంటి కాంతమ్మ ఇటీవల మరణించారు. ఆదివారం ఆమె దశదిన కర్మల సందర్భంగా కొత్వాల పాల్గొని, సంతాపం, సానుభూతి తెలిపారు.

పట్టణ పరిధిలోని నెహ్రు నగర్ నివాసి పొదిల ఉపేందర్ తండ్రి పొదిల సాంబయ్య ఇటీవల మరణించారు. ఆదివారం ఆయన దశదిన కర్మల సందర్భంగా కొత్వాల పాల్గొని, సంతాపం, సానుభూతి తెలిపారు. 

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, అలెక్స్, CPM నాయకులు తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.