భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలు జారీ చేశారు.జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌకర్యార్థం నియోజకవర్గాల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రజావాణి నిర్వహిస్తారు.

కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ప్రజావాణి నిర్వహిస్తారు.

కావున జిల్లా ప్రజలందరూ తమ నియోజకవర్గ పరిధి ప్రకారం సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించి, భూసమస్యల పరిష్కారానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.