భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్

విద్యార్థుల కోసం ఎక్కడైన, ఎంత దూరమైన కొల్లిఫౌండేషన్ సేవలు

పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయితీ పరిధిలోని కోయగట్టు పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు, స్టేషనరి పంపిణి చేసిన కొల్లి కల్పనా చౌదరి

పాల్వంచ రూరల్ : గిరిజన ప్రాంతాలలోని పేద విద్యార్థులకు విద్యను అందించాలని పాల్వంచ మండలం కోయగట్టు గ్రామంలో ఒక నెల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ప్రారంభించిన ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించడానికి గుర్తించిన 45 మంది నిరుపేద విద్యార్థులకు అండగ మేమున్నామంటు ముందుకు వచ్చారు కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కల్పనా చౌదరి.

కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ సహకారంతో కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయగట్టు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, డ్రాయింగ్ బుక్స్, బ్యాగులు, నోటు పుస్తకాలతో పాటుగా స్టేషనరి ని అందించారు.

ఈ సందర్బంగా కల్పనా చౌదరి మాట్లాడుతూ… కొల్లి ఫౌండేషన్ విద్యాభివృద్ధి పెంచేందుకు ఎల్లపుడు ముందుంటుందన్నారు. చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, చదువుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరని ప్రతి ఒక్కరు విద్యను ప్రోత్సహించాలన్నారు. తల్లి తండ్రుల ఆశలు, ఆశయాలకు తగ్గట్లుగా పిల్లలు చదువుకోవాలని సూచించిన ఆమె పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరితేనే చదువుకు సార్ధకత లభిస్తుందన్నారు.

రాబోయే రోజుల్లో కూడ ప్రభుత్వంతో కలిసి విద్యార్థుల ప్రయోజనం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, భవిష్యత్ లో కోయగట్టు పాఠశాల పక్కా భవన నిర్మాణం కోసం సహాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. Mpps కోయగట్టు ప్రధానోపాద్యయులు N.Biksham గారు మాట్లాడుతు పాఠశాలలో పిల్లల పరిస్థితి గురించి తెలిపిన వెంటనే స్పందించి మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కోయగట్టు గ్రామానికి సరైన రహదారి లేకపోయిన వచ్చి విద్యార్థులకు అండగా నిలిచిన కొల్లి ఫౌండేషన్ ఫౌండర్ కల్పనా చౌదరి, కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ గూడూరు సత్యనారాయణ, కో-ఆర్డినేటర్ రూప్లా నాయక్ లకు విద్యార్థులు, వారి తల్లితండ్రుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు కొల్లి కల్పనా చౌదరి ని శాలువాతో సత్కరించి సన్మానించారు.