భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం
✍️దుర్గా ప్రసాద్

ఈ రోజు కలెక్టర్ గారు మణుగూరు మండలం ఫ్లై యాస్ పాండు, దమ్మక్క పేట సమీపంలోని బీటీపీఎస్‌ వద్ద తక్కువ ఖర్చుతో, నాణ్యమైన ఇటుకలను (ఇసుక, సిమెంట్, ఫ్లై యాష్‌, క్లే వంటి మిశ్రమాలతో) తయారు చేసే ప్రయోగాత్మక విధానాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో బీటీపీఎస్‌ చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్లు మరియు పంచాయతీరాజ్, ఉపాధిహామీ, హౌసింగ్ తదితర విభాగాల ఇంజనీర్లతో పాటు తహసిల్దార్ ,ఎంపీ ఓ apo ,యాప్,అధికారులు మరియు వివిధ స్థాయిల సిబ్బందిపాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ గారి ప్రధాన ఉద్దేశం – ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, అలాగే ఉపాధి హామీ పనులకు తక్కువ ధరలోనూ, మంచి నాణ్యత కలిగిన ఇటుకలు అందుబాటులోకి తేవడం.

రాబోయే 30వ తేదీన బీటీపీఎస్‌లో మూడు మిషన్లతో విభిన్న కాంబినేషన్లలో నాణ్యమైన ఇటుకల తయారీపై ప్రాక్టికల్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో లబ్ధిదారులు మరియు ఇతర సిబ్బంది, ఔత్సాహికులు పాల్గొని ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశముంటుంది.