మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:5 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: స్థానిక బూడిదిగడ్డ బస్తీ 21 వ వార్డులో వాటర్ ట్యాంక్ ఏరియా దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మండలిలో బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
ఆనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, బూడిదగడ్డ బస్తి ప్రజలకు ఆ గణనాథుని ఆశీర్వాదాలు ఉండాలని,పౌర సేవలో పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
కుల మతాలకు అతీతంగా ప్రజలు మంచి వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, వినాయక నిమజ్జనం కూడా యువత శాంతియుత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజనాల కమల, బీఆర్ఎస్.వీ జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజనాల రమేష్,కమిటీ సభ్యులు బడికల లక్ష్మణ్, నాగుల రాంచందర్,సుంకరి తిరుపతి, దుర్గం సురేష్, మాదరబోయిన గోపాల్, సుంకరి వెంకటేష్,పెద్దపల్లి లక్షయ్య, మల్లెపల్లి మోహన్, కంటేవాడ నగేష్, పాఠకుల సురేష్, బస్తి ప్రజలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్
- శిశు మందిర్ పాఠశాలలో దేశ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…
- బావిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య
- మున్సిపల్ కమిషనర్ స్పందన పట్ల అభినందనలు తెలిపిన కాంట్రాక్టర్ బస్తీ వాసులు
- నేత్రదానం తో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు నింపిన జంగపల్లి రాజారాం
- ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
















