భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలను ఆస్ట్రేలియా తిప్పికొట్టింది. ఆ దేశ వాణిజ్యమంత్రి డాన్ ఫారెల్ మాట్లాడుతూ…

భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని, తమ అదృష్టాన్ని (ఖనిజ సంపదను) పంచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ లో తమకు గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇరు దేశాల మధ్య సరఫరా వ్యవస్థలను మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.