మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:14 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: స్థానిక వ్యాపారి మహేందర్ చౌదరి తనయుడు అరవింద్ చౌదరి గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్ళితే …
మహేందర్ చౌదరి కార్ లో తన కుటుంబముతో కలిసి రాజస్థాన్ కు పయనమయ్యారు. మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లా, కన్నోడ్ లో లారీ గుద్దడం వల్ల అరవింద్ ఘటన స్థలం లోనే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో కుటుంబ సభ్యులు బయటపడ్డారు.
ఇటీవలే స్కూల్ లో తమ పుత్రుడి అడ్మిషన్ కోసం మహేందర్ చౌదరి పడరాని పాట్లుపడి ఒక సందర్భంలో పోరాటం చేయాల్సి వొచ్చిన విషయం తెలిసిందే, ఒక ప్రైవేటు పాఠశాలలో అవిటితనాన్ని సాకుగా చూపిస్తూ తమ పుత్రునికి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు సైతం పిర్యాదు చేసాడు.
అయినా పాఠశాల యాజమాన్యం తలొగ్గక పోవడంతో విద్యార్థి సంఘాల జోక్యంతో సామాజిక మాధ్యమాల్లో వార్త పత్రికల్లో ప్రచురణ అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ చొరవతో డీఈఓ యాదయ్య, ఎంఈఓ పోచయ్య ఆదేశాలతో తిరిగి అడ్మిషన్ పొందాడు. తమ పుత్రుడు అరవింద్ కు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన మహేందర్ సమాజంలో ఎన్నో సవాళ్లను,అవమానాలను ఎదుర్కొని చివరికి అడ్మిషన్ ఇప్పించాడు.
కానీ చివరికి లారీ రూపంలో తమ పుత్రుడు అరవింద్ ని మృత్యువు కబళించింది. ఈ ఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి ….
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
