భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం సెప్టెంబర్ 01,2025
✍️దుర్గా ప్రసాద్
ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కరించండి…, నష్టపోయిన పేదలకు పరిహారం, పునరావాసం కల్పించాలి…., ద్వంసమైన రోడ్లు, డ్రైన్ల పుననిర్మాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలి… – సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
కొత్తగూడెం కార్పొరేషన్, పరిసర ప్రాంతాల్లో ముంపుకు గురైవుతున్న ప్రాంతాలను గుర్తించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అధికారులను కోరారు.
భారీ వర్షాలతో ముంపుకుగురైన ఎస్ సి బి నగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం సిపిఐ ప్రతినిధిబృందం పర్యటించింది. బాధిత ప్రజలను కలుసుకొని జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సమాచారం ఇచ్చి ప్రభావిత ప్రాంతాలకు రప్పించి పరిస్థితులను వివరించారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ భారీవర్షాలతో అంతర్గ రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ స్తంబాలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, వర్షాలు కొనసాగితే మరింత ప్రమాదం పరిస్థితులు నెలకొంటాయని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, పుననిర్మాణపనులు చేపట్టాలని కోరారు.
ఇండ్లు కోల్పోయిన పేదలకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచివుందని తక్షణమే వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి నిధ్యం అందించాలని కోరారు.
సమస్యను స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని దృష్టికి తీసుకెళ్లామని, అత్యవస నిధులు మంజూరు చేయించి ముంపుసమస్యని పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారన్నారు.
పాత కొత్తగూడెం – పెనుబల్లి బ్రిడ్జిని సందర్శించి ప్రమాదకర పరిస్థితులను పరిశీలించారు. కూనంనేని కృషితో పెనుబల్లి బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల రూ.6.50కోట్లు సిఆర్ఆర్ మంజూరయ్యాయని,అక్టోబర్ లో పనులు ప్రారంభం అవుతాయని, వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తయి పెనుబల్లి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిస్కారం లభిస్తుందన్నారు.
ప్రతినిధిబృందం సాబీర్ పాషా వెంట నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, మునిగడప వెంకటేశ్వర్లు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సందెబోయిన శ్రీనివాస్, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
















