వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచలోని కిన్నెరసాని రోడ్ లో గల ఆర్ఆర్ నేత్రాలయ కంటి హాస్పటల్ ఏర్పాటుచేసి 9 వసంతాలు పూర్తిచేసుకుని 10 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన వినాయక మట్టి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ… ఆర్ఆర్ నేత్రాలయ కంటీ హాస్పిటల్ పాల్వంచలో ఏర్పాటు చేసి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినదని ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో చాలామంది పేదలకు ఉచిత కంటే ఆపరేషన్లు చేసినారని ఈ ఉచిత ఆపరేషన్లు చేసినటువంటి డాక్టర్ అలుమోలు భగవాన్, డాక్టర్ వనపర్తి హరికృష్ణ, డాక్టర్ అశోక్ లకు పేద ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని హాస్పిటల్ ఏర్పాటు చేసి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు మూడు రోజులు అనగా 26-8-2025 నుండి 28-08-2025 వరకు ఉచిత కంటి పరీక్షా శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ యొక్క శిబిరం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎటువంటి డబ్బులు లేకుండా కంప్యూటర్ పై ఉచిత కంటి పరీక్షలు చేస్తారని ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని అలాగే ఆర్ఆర్ నేత్రాలయ వారు ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగకు మట్టి విగ్రహాలు తయారు చేయించి వాటిని తన చేతుల మీదుగా భక్తులకు అందజేయడం తనకు గొప్ప వరమని భక్తులు ఎవరు కూడా ప్లాస్టాపారిస్ విషపూరిత రంగుల వినాయక విగ్రహాలు ప్రతిష్టించవద్దని స్వచ్ఛమైన మట్టితో తయారుచేసిన విగ్రహాలను పెట్టి పూజలు చేసుకోవాలని ప్లాస్టాపారిస్ విషపూరిత రంగుల విగ్రహాల వలన నిమజ్జనం చేస్తున్నటు వంటి చెరువులు, నదులు కలుషితంగా మారుతాయి.
ఆ యొక్క విగ్రహాలు నీటిలో కరిగిపోకుండా సంవత్సరాల తరబడి అలాగే ఉంటాయని మట్టితో తయారుచేసిన విగ్రహాలు నిమజ్జనం చేయగానే నీటిలో కరిగిపోతాయని అందుకే మట్టి వినాయకుని విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అల్లమోలు భగవాన్, డాక్టర్ వనపర్తి హరికృష్ణ, డాక్టర్ అశోక్, చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, కేసరి రాజేష్, కొండపల్లి సతీష్, సిద్ధాని సూర్య, చింతమల్ల గ్లోరీ, బాహటం సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
