భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
లక్ష్మీదేవిపల్లి
✍️దుర్గా ప్రసాద్

శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ సందర్శించి డాక్టర్ మోకళ్ళ వెంకటేశ్వరరావు MBBS.MD General physician గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్.

10/- రూపాయలకే వైద్యం అందించాలని ఆలోచన చాలా గొప్ప విషయం అని, వైద్య సౌకర్యం వివరాలు తెలుసుకొన్నారు అరేం ప్రశాంత్ గారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ ఏజెన్సీ మారుమూల ప్రాంత ప్రజలు అందురు 10/- రూపాయల వైద్యం సేవ సౌకర్యాలు వినియోగించుకోవాలి. పేదల పట్ల అంకితభావంతో వైద్య సౌకర్యాలు అందించాలని తక్కువ ఖర్చుతో 10/- రూపాయల వైద్యం సేవలు జీవితాంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు డాక్టర్ మోకళ్ళ వెంకటేశ్వరరావు గారు.

ప్రస్తుతం ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తదుపరి సమయంలో 10/- రూపాయల వైద్యం అందించాలని గ్రామీణ మారుమూల ప్రాంతంలో విష జ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెంది ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తు పేదలకు వైద్య సౌకర్యాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోరా రమేష్ సోడే మధు పాల్గొన్నారు.