మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది. 09 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు

బెల్లంపల్లి: రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,
మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ ఉత్తర్వుల మేరకు, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆదేశాలతో బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు సెప్టెంబర్ 10 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ అవకాశాన్ని కక్షి దారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు కోర్టుల చుట్టూ తిరుగుతూ, తమ విలువైన సమయాన్ని డబ్బులు వృధా చేసుకోకూడదని, .ఒకరినొకరు అర్థం చేసుకొని కక్షీదారులందరూ రాజి పడి ఈ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం కోసం మాదరం పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరని తెలిపారు.