< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 18 వ వార్డు,ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని,వీధి దీపాలు ఏర్పాటు చేయాలని శుక్రవారం మున్సిపల్ ఇంజనీర్ నిఖిల్ కు బస్తీ వాసులు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…, చిన్నపాటి వర్షం పడితే చాలు బస్తీ వాసులు నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొవలసి వొస్తుందని తెలిపారు. వీధి దీపాలు లేక చీకటిలో ఒక వైపు కుక్కలు,ఇంకో వైపు విష సర్పాల భారీ నుండి కాపాడుకుంటూ బిక్కు బిక్కు మంటూ అడుగులు వేయాల్సి వొస్తుందని వాపోయారు. రాబోయే బతుకమ్మ దసరా పండుగలను దృష్టిలో పెట్టుకుని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ కార్యదర్శి నారా నగేష్, కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.