దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత!

✍️దుర్గా ప్రసాద్

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం చత్తీస్గడ్ దంతవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్, భద్రత బలగాలు, కహల్చనార్ ప్రాంతంలో 53వ బెటాలి యన్ ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నక్సల్ స్మారకాన్ని ధ్వంసం చేసింది.

కాగా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రాబోయే మహోయిస్టుల వారోత్సవాలు నిర్వహించకుండా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించకుండా ఈ స్థూపాలను కూల్చి వేసినట్లు తెలుస్తుంది.