భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్
భద్రాచలం వందల కేసులు మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అవుతున్న మందులు దొరకని వైనం ఎన్నోసార్లు పత్రికలో ఎన్నో సామాజిక సేవ కర్తలు మరియు పొలిటికల్ పార్టీల ద్వారా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది కానీ తాత్కాలికంగా మారిన చర్యలు అప్పటికప్పుడు రెండు రోజులు వరకు మందులు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్న మలేరియా డిపార్ట్మెంట్.
ప్రజల ప్రాణాలకు హామీ ఇచ్చేది ఎవరు….?
భద్రాచలం డివిజన్లో చర్ల, కొయ్యూరు, సత్యనారాయణపురం, పర్ణశాల, లక్ష్మీనగరం, బూర్గంపాడు, మణుగూరు ఇలా అన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి రిఫర్ అవుతున్న వందల మలేరియా పాజిటివ్ కేసులు మందుల సప్లై లేక తల్లాడుతున్న వైద్య బృందం.
రెండు ఇంజక్షన్ల ధర 550 రూపాయలు, ఒక్క పేషెంట్ కి కనీసం ఐదు ఇంజక్షన్లు చేయాలి బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏమిటి…?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ చర్యలు శూన్యం పత్రికా ప్రకటన వరకే పరిమితమైన కలెక్టర్ ఆదేశాలు.
ఏజెన్సీ ప్రాంతమై నాలుగు రాష్ట్రాల సరిహద్దు కేంద్ర ప్రాంతంగా భద్రాచలం ఏరియా హాస్పిటల్ రోజుకి నిత్యం వందల కేసులు వైద్యుల కొరత, మందుల కొరత, రక్త పరీక్షల కొరత, సిబ్బందికి జీతాలు కొరత, సమస్యల వలయంగా భద్రాచలం ప్రభుత్వాసుపత్రి, అన్నిటికీ సాక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులు, పట్టించుకునే నాధుడు లేడయ్యా అంటున్న రోగులు.
మలేరియా డిపార్ట్మెంట్ నుండి స్పందన లేదంటున్న వైద్య బృందం. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని యువతరం పార్టీ డిమాండ్ చేస్తుంది.
మలేరియా మందుల సప్లై పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కలవు అని పెట్టి ప్రాణాలు తీసే మహమ్మారికి మందులు కొరత ఏర్పాటు చేస్తే ఎలా అని యువతరం పార్టీ ప్రశ్నిస్తుంది.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అజ్మీర నరేష్ నాయక్, ఆంధ్ర రాష్ట్ర నాయకులు గుగులోత్ బాబు నాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి గారు పాల్వంచ మండలం అధ్యక్షులు బలగం సురేష్ ,పార్టీ నాయకులు గుగులోత్ కాలిందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






