localnewsvibe

జనకమహారాజుకి  సుమేధ, సునయన – అని ఇరువురు భార్యలున్నట్లు పురాణ వాజ్ఞ్మయం చెప్తోంది.

సీత ఎవరికీ పుట్టలేదు. ఆమె అయోనిజ. భూమి నుండి స్వయంగా ఉద్భవించి యజ్ఞార్థం భూమిని దున్నుతున్న జనకునికి దొరికింది.

ఆమెను సుమేధకు అందించి పెంచసాగాడు. ఊర్మిల సునయనకు జన్మించింది. ‘జనక ‘ అనే పేరు విదేహ రాజులందరికీ సాధారణం. సీతను పెంచిన తండ్రీ, ఊర్మిల తండ్రీ అయిన జనకుని పేరు  సీరధ్వజుడు. అతని తమ్ముడు పేరు – కుశద్వజుడు. ఈ కుశధ్వజుని భార్య పేరు ఇందిర. ఆ దంపతులకు పుట్టిన వారే మాండవి, శ్రుతకీర్తి.  సీత రాముని, ఊర్మిళ లక్ష్మణుని, మాండవి భరతునీ, శత్రుఘ్నుడు శ్రుతకీర్తిని వివాహమాడారు.