మీరు దైర్యం చెయ్యకపోతే దరిద్రం నీనుండి దూరం కాదు, నీవు సహసం చెయ్యకపోతే సంతోషం మన దరికి రాదు. జీవితంలో ప్రతి మాట ఒక గుణపాఠం అవుతుంది ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది. ఒకరికి మనం గర్వం చూపెట్టడానికి బదులు గౌరవింఛడానికి ప్రయత్నిస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది .

ఇష్టపూర్వకంగా కోరుకున్నదే అదృష్టం బలంగా నమ్మినదే భవిష్యత్తు, అందంగా ఉన్నవాడు ఆనందంగా ఉన్నవారు ఆనందంగా ఉంటారో లేదో కానీ ఆనందంగా ఉన్నవారు మాత్రం అందంగా కనిపిస్తారు , అందుకే ఆనందంగా ఉండండి అప్పుడు మీరు అందంగా కనిపిస్తారు.

ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికీ అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు . నీవు వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గు పడితే వయసు దాటక బ్రతకడానికి ఇబ్బంది పడ వలసి వస్తుంది ఇది భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే మాట….