🕉️ పూజ –> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది.
🕉️ అర్చన–> అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
🕉️ జపం–> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
🕉️ స్తోత్రం–> నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
🕉️ ధ్యానం–> ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది. ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.
🕉️ దీక్ష–> దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.
🕉️ అభిషేక:–> అహంభావాన్ని పోగొట్టేది. భయాన్ని మథించేది. పవిత్రోదకాన్నిచల్లేది. ఆనందాదులను కల్గించేది.
🕉️ మంత్రం–> తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.
🕉️ ఆసనం–> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
🕉️ తర్పణం–> పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
🕉️ గంధం–> అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది. ధర్మఙ్ఞానాలనిచ్చేది.
🕉️ అక్షతలు–> కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
🕉️ పుష్పం–> పుణ్యాన్ని వృద్ధిచేసే. , పాపాన్ని పోగొట్టేది. పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
🕉️ ధూపం–> చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది.
🕉️ దీపం–> సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
🕉️ నైవేద్యం–> ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్థాలను, దేవతకు తృప్తినిచ్చే దానిని నివేదన చేయుటయే.
🕉️ ప్రసాదం–> ప్రకాశానందాల నిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
🕉️ ఆచమనీయం–> లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం.
🕉️ ఆవాహనం–> పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
🕉️ స్వాగతం–> దేవతను కుశలప్రశ్నవేయుట.
🕉️ పాద్యం–> చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
🕉️ మధుపర్కం–> తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
🕉️ స్నానం–> గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.
🕉️ వందనం–> అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).
🕉️ ఉద్వాసన–> దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.