తులసి ఆకులు
తులసి ఆకులు ఆస్తమా స్థాయిలను తగ్గించుటలో శక్తివంతంగా పనిచేస్తాయి. తులసి ఆకుల నుండి తయారు చేసిన రసంను వేడి నీటిలో కలిపి, అందులో నుండి వచ్చే వేడి ఆవిరులను ముక్కు నుండి పీలుస్తూ, నోటి నుండి వదలాలి. దీని వలన తులసి ఆకులలో ఉన్న యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు శ్వాస గోట్టలో కలిగే ఇన్ఫ్లమేషన్’లను తగ్గించి ఆస్తమా స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా ఆస్తమా స్థాయిలను నుండి ఉపశమనం పొందుతారు
కెఫిన్
రోజు క్రమం తప్పకుండా కాఫీ తాగటం వలన ఆస్తమా స్థాయిలు తగ్గే ముఖం పడతాయి కారణం కాఫీలో ఉండే కెఫిన్ ‘బ్రాంకియోడైలెటర్’లుగా పనిచేస్తాయి. కాఫీ తాగటం వలన శ్వాస గొట్టాలను శుభ్రపరచి, శ్వాసను సులభతరం చేస్తాయి. గాడత ఎక్కువగా ఉన్న కాఫీ తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. కానీ రోజు మొత్తంలో 3 కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగకూడదు. ఎక్కువ తాగటం వలన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.
తేనె
ఆస్తమా వ్యాధులను తగ్గించే పట్టికలో తేనె కూడా చేర్చబడింది. తేనె ఆస్తమా స్థాయిలకు పెరుగుటకు కారణమయ్యే మ్యూకస్ లేదా శ్లేష్మాన్ని స్థిరీకరణం చెందిస్తుంది. మీలో ఆస్తమా స్థాయిలు పెరిగినపుడు తేనెను ముక్కు దగ్గర పెట్టుకొని దాని వాసనను పీల్చుకోండి. అంతేకాకుండా, రోజు ఒక గ్లాసు వేడి నీటిలో తేనెను కలుపుకొని తాగటం వలన ఆస్తమా స్థాయిల నుండి ఉపశమనం పొందుతారు.
మెంతులు
మెంతులు శరీరంలోని అలర్జీలను తగ్గించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కొన్ని మెంతి విత్తనాలను తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలిపి, నీరు మూడవ వంతుకు చేరే వరకు వేడి చేయండి. ఈ మిశ్రమానికి తేనె మరియు వెల్లుల్లి రసంలను కలిపి రోజు ఉదయాన తాగండి. దీని వలన మీరు తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు
ఎండిన పండ్లు
ఈ రకమైన పండ్లు చాలా తియ్యగా ఉంటాయి మరియు వీటి వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాన్ని కలుగుతాయి. ఈ పండ్లను నీటిలో నానబెట్టి పూర్తి రాత్రి వరకు అలానే వదిలేయాలి మరియు ఉదయాన ఏదైనా తినటానికి ముందు వీటిని ఖాళీ కడుపుతో తినాలి. ఇవి శ్వాస గొట్టాలలో కలిగే కండరాల సమస్యలను తగ్గించి శ్వాసను సులభతరం చేస్తాయి. అంతేకాకుండా, వివిధ రకాల ఇన్ఫెక్షన్’లను కూడా తగ్గిస్తాయి.
అల్లం మరియు వెల్లుల్లి
అల్లం మరియు వెల్లుల్లి రెండు కూడా ఆస్తమా తగ్గించుటలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఆస్తమా కలిగిన ప్రారంభ దశలో 30 మిల్లి లీటర్ల పాలలో వెల్లుల్లిని కలిపి వేడి చేయండి. ఈ మిశ్రమం ఎక్కువ వేడి అయ్యేలా జాగ్రత్త పడండి. అంతేకాకుండా, రెండు చెంచాల వెల్లుల్లి, అల్లం కలిపిన టీని రోజు ఉదయాన మరియు సాయంత్రం తాగటం వలన ఆస్తమా వ్యాధి నియంత్రణలో ఉంటుంది.