పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఆకలి ఉండదని… ఆహారం మితంగా తీసుకునేందుకు వీలుంటుందని, తద్వారా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

టమోటో జ్యూస్:
ఏడు రోజుల్లో బరువు తగ్గాలనుకుంటే 3 టమోటోలను బాగా ఉడికించి.. మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం చేర్చి మూడు పూటలా తీసుకుంటే బరువు తగ్గుతారు.

లెమన్ జ్యూస్‌ :

లెమన్ జ్యూస్‌లో చిటికెడు ఉప్పు, తేనె చేర్చి రోజూ ఉదయం పరగడుపున తీసుకున్నట్లైతే… చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చు.

గ్రేప్ జ్యూస్:
గ్రేప్ జ్యూస్‌లోని ప్రోటీన్లు, గుడ్ కొలెస్ట్రాల్ ఉండటంతో ఈ జ్యూస్ ద్వారా బరువు తగ్గుతారు.

అవకోడా జ్యూస్:
అవకోడాను గ్రైండ్ చేసి.. తేనె కలుపుకుని తాగితే పొట్టను తగ్గించుకోవచ్చు. ఇందులోని గుడ్ కొలెస్ట్రాల్.. శరీరంలోకి కెలోరీల శాతాన్ని బర్న్ చేస్తుంది.

జామ జ్యూస్:
జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం ద్వారా వారానికి రెండు సార్లు జామపండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అనాసపండు రసం:
అనాస జ్యూస్‌తో ఆకలి తగ్గిపోతుందని.. అందుచేత సులభంగా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆరెంజ్ జ్యూస్:
ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారు. గోరు వెచ్చని నీటిలో ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.