localnewsvibe

తాజాగా ఆయిల్ కంపెనీలు హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌, ఇండెన్‌ గ్యాస్‌ లు వాట్సప్‌ ద్వారా సిలిండర్ బుకింగ్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టాయి.

మీ గ్యాస్ కంపెనీ వాట్సాప్ నంబర్‌కు నేరుగా ఒక్క మెసేజ్‌ పెట్టి సిలిండర్‌ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త కలెక్షన్‌ కూడా వాట్సాప్‌ ద్వారా తీసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌లో కొత్త కనెక్షన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు.

వాట్సప్‌లో బుకింగ్ విధానం…

మొదట మీ గ్యాస్ కంపెనీ నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.

తర్వాత ఆ నంబర్‌కు వాట్సప్‌లో Hi అని మెసేజ్ చేయాలి.

బుకింగ్, సిలిండర్ పేమెంట్, రివార్డ్స్ అండ్ ఆఫర్స్ వంటి ఆప్షన్లు వస్తాయి.

బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. పేమెంట్ లింక్ వస్తుంది (గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే ద్వారా పేమెంట్ చేయవచ్చు)

పేమెంట్ కంప్లీట్ చేశాక గ్యాస్ బుకింగ్ అయినట్లు మెసెజ్ వస్తుంది.

వాట్సాప్‌లోనే బుకింగ్ నెంబర్, సిలిండర్ డెలివరీకి సంబంధించిన పూర్తి వివరాలు మెసెజ్ రూపంలో వచ్చేస్తాయి.

HP గ్యాస్‌ వినియోగదారులు 9222201122 నంబర్‌కు,

భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344 నంబర్‌కు.

ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7588888824 లేదా 7718955555 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలి.