ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో చెరకు మద్దతు ధర ను క్వింటాల్‌కు రూ. 210 నుండి రూ. 315కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ స్థాయిలో చెరుకుకు మద్దతు ధర పెంచడం దేశంలోనే తొలిసారి అని, దీని వలన 5 కోట్ల మంది చెరుకు రైతులకు లబ్ధి చేకూరుతుందని, మరియు చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుదని అనురాగ్ ఠాకుర్ తెలిపారు.

యూరియా రాయితీ పథకాన్ని రూ. 3,68,678 కోట్లతో కొనసాగించాలని, మరియు రూ. 1451 కోట్లు మార్కెట్ల అభివృద్ధికి కేటాయించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది.