తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో ఉన్న అతని ఫామ్ హౌస్ కు వెళ్లారు.

రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన సాయిచంద్ తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఇప్పటివరకు అనేక పాటలు పాడారు. అందులో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.